ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 17 జనవరి 2021 (16:33 IST)

క్రికెట్‌ బెట్టింగ్‌తో 'సూపర్‌ ఓవర్‌`-జనవరి 22న రిలీజ్

super
తెలుగు వారి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుని వారికి తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోన్న తెలుగు ఓటీటీ 'ఆహా'. ఈ అన్‌లిమిటెడ్‌ ఎంటైనింగ్‌ ఛానెల్‌లో జనవరి 22న ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది 'సూపర్‌ ఓవర్‌' చిత్రం. 
 
ఈ సినిమా స్నీక్‌పీక్‌ను శర్వానంద్ ఇటీవ‌లే విడుదల చేశాడు. రీసెంట్‌గా ఆహాలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకులను మెప్పించిన 'మెయిల్‌' సినిమాతో పాటు 'మా వింతగాథ వినుమా, కలర్‌ఫొటో, ఒరేయ్‌ బుజ్జిగా' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో పాటు సమంత అక్కినేని వ్యాఖ్యాతగా చేసిన 'సామ్‌జామ్‌' టాక్‌ షో, హర్ష చెముడు చేసిన కామెడీ షో 'తమాషా' వంటి కార్యక్రమాలు తెలుగు వారిని అలరించాయి.
 
'సూపర్‌ ఓవర్‌'  సినిమాను దివంగ‌త ద‌ర్శ‌కుడు‌ ప్రవీణ్‌ వర్మ తెరకెక్కించారు.  సుధీర్‌ వర్మ నిర్మాత‌. థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, చాందిని చౌదరి, అజయ్‌, రాకేందు మౌళి తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించారు. 
 
క్రికెట్‌ బెట్టింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం స్నీక్‌పీక్‌ను ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసిన శర్వానంద్‌ ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇదివరకే ఆహాలో విడుదలైన  'భానుమతి అండ్‌ రామకృష్ణ'తో నవీన్‌ చౌదరి, 'కలర్‌ఫొటో'తో చాందిని చౌదరి సూపర్‌హిట్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించిన 'సూపర్‌ ఓవర్‌' ఎలా ఉంటుందోననే ఆసక్తి పెరిగింది.
 
ఎప్పుడైనా ఎక్కడైనా అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న తెలుగువారి ఓటీటీ 'ఆహా'ను రూ.365 చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ సొంతం చేసుకోచ్చు. తక్కువ సమయంలోనే తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రపచంలో ఆహా తనకుంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. తెలుగువారి ఫేవరేట్‌ సూపర్‌స్టార్స్‌ నటించిన చిత్రాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రాలు, ఆహా ఒరిజినల్స్ ప్రేక్షకులను రంజింప చేస్తున్నాయి.