1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TRS Leader attack on Disabled youth at Karim Nagar

తెరాస ధూంధాం కార్యక్రమం.. దివ్యాంగుడిపై తెరాస నేత దాష్టీకం

Karimnagar
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో అధికార తెరాస ఆధ్వర్యంలో ధూంధాం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడు హాజరయ్యాడు. అయితే, ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న గెల్లు శ్రీనివాస్‌తో పాటూ ఎమ్మెల్యే హాజరయ్యారు. 
 
సభ చాలా సీరియస్‌గా జరుగుతుంటే... రాజేష్ అనే దివ్యాంగుడు తనకు పింఛన్ రావడం లేదని నాయకులను కలిసేందుకు ప్రయత్నించాడు. అయితే అతన్ని పోలీసులు, స్థానిక నాయకులు అడ్డుకున్నారు. సభ ముగిసిన తర్వాత దివ్యాంగుడు.. స్టేజిపైకి ఎక్కి తనకు పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదంటూ మైకులో అడిగాడు. 
 
దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ మహేంద్రాచారి.. ఆగ్రహంతో ఊగిపోయి, స్టేజిపైకి ఎక్కి దివ్యాంగుడు రాజేష్‌ను కిందకు లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. అక్కడున్న వారంతా ఆ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ ఇప్పించాల్సింది పోయి.. అడిగినవారిపై దాడి చేస్తారా.. అంటూ మండిపడ్డారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి