1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TRS MLA Rajaiah fires on false allegations on him

అదంతా మిమిక్రీ... పెట్టినవాళ్లను వదలను... రాజయ్య ఫైర్

రానున్న ఎన్నికల్లో నన్ను ఎదుర్కొనలేక మిమిక్రీ ఆర్టిస్టులతో నా గొంతును అనుకరించి ఓ ఆడియో టేపును వదిలారని తెరాస ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. ఆ టేపులు పెట్టిన అడ్మిన్ ఎవరో తేల్చేందుకు పోలీసు కేసు పెట్టినట్లు వెల్లడించారు. తన పరువు ప్రతిష్టలను బజారుకీడ్

TRS MLA Rajaiah
రానున్న ఎన్నికల్లో నన్ను ఎదుర్కొనలేక మిమిక్రీ ఆర్టిస్టులతో నా గొంతును అనుకరించి ఓ ఆడియో టేపును వదిలారని తెరాస ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. ఆ టేపులు పెట్టిన అడ్మిన్ ఎవరో తేల్చేందుకు పోలీసు కేసు పెట్టినట్లు వెల్లడించారు. తన పరువు ప్రతిష్టలను బజారుకీడ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
కాగా తెరాస తరుపున వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బరిలోకి దిగనున్న రాజయ్య మరో తెరాస మహిళా నాయకురాలితో అసభ్యంగా మాట్లాడారంటూ పలు చానళ్లలో నిన్నటి నుంచి ఓ ఆడియో హల్చల్ చేస్తోంది. వారిమధ్య జరిగిన సంభాషణను కూడా బయటకు వచ్చాయి. వెలికి వచ్చిన ఆడియోలో కొన్నిచోట్ల బీప్ సౌండ్ కూడా వున్నది. మరి ఈ ఆడియో నిజంగా రాజయ్యదేనా లేదంటే ఆయన చెప్పినట్లు మిమిక్రీ ఆర్టిస్టులతో చేయించినదో తేలాల్సి వుంది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
బెస్ట్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే కొండగట్టు ప్రమాదం... 58కి చేరిన మృతులు