శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 19 మే 2018 (14:32 IST)

కాంగ్రెస్ ఎమ్మెల్యేతో యడ్యూరప్ప బేరం... బస్సు దిగావంటే మంత్రివవుతావ్...

కర్నాటక ముఖ్యమంత్రి విశ్వాస పరీక్ష జరుగుతోంది. బల నిరూపణకు మరికొన్ని గంటలే సమయం వుంది. ఇదిలావుంటే అధికారంలో ఎలాగైనా కొనసాగాలని భాజపా చేసిన ప్రయత్నాల తాలూకు ఆడియో టేపులు లీక్ అవుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో చేసిన

కర్నాటక ముఖ్యమంత్రి విశ్వాస పరీక్ష జరుగుతోంది. బల నిరూపణకు మరికొన్ని గంటలే సమయం వుంది. ఇదిలావుంటే అధికారంలో ఎలాగైనా కొనసాగాలని భాజపా చేసిన ప్రయత్నాల తాలూకు ఆడియో టేపులు లీక్ అవుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో చేసిన సంభాషణ బయటకు వచ్చింది. అదెలా సాగిందో చూడండి.
 
సీఎం యడ్యూరప్ప : పాటిల్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు?
పాటిల్ : బస్సులో కొచ్చికి వెళ్తున్నాం
సీఎం యడ్యూరప్ప : అక్కడికెందుకు, ఇక్కడికి వచ్చేయండి. మంత్రి పదవి ఇస్తాం.. మాట్లాడుదాం. 
పాటిల్ : ఇది మొదటే చెప్పి ఉంటే బాగుండేది. బస్సులో వెళ్తున్నప్పుడు చెప్తే ఎలా?
సీఎం యడ్యూరప్ప : సర్లే... ఏదో కారణం చెప్పి వెనక్కి వచ్చేయ్. 
పాటిల్ : మరి నా పొజిషన్ ఏంటీ?
సీఎం యడ్యూరప్ప : నిన్ను మంత్రిని చేస్తాను.
పాటిల్ : నాతో పాటు మరో ఇద్దరుముగ్గురు ఉన్నారే. ఎలా? 
సీఎం యడ్యూరప్ప : వాళ్లని కూడా వెంటపెట్టుకుని వచ్చేయ్. బస్సులో కొచ్చి వెళ్తే తిరిగి రాలేవు. 
పాటిల్ : మరో ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తా. 
సీఎం యడ్యూరప్ప : ఆ విషయం శ్రీరాములకు చేసి చెప్పు.