శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 19 మే 2018 (08:54 IST)

కర్ణాటకలో 4 గంటలకు షో... అసెంబ్లీలో యడ్యూరప్ప బలపరీక్ష

కన్నడ రాజకీయం పతాక స్థాయికి చేరింది. శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష జరుగనుంది. వాస్తవానికి బల పరీక్షకు గవర్నర్ వజూభాయ్ పటేల్ 15 రోజులు గడువిచ్చినా, సుప్రీంకోర్టు దాన్ని తోసిప

కన్నడ రాజకీయం పతాక స్థాయికి చేరింది. శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష జరుగనుంది. వాస్తవానికి బల పరీక్షకు గవర్నర్ వజూభాయ్ పటేల్ 15 రోజులు గడువిచ్చినా, సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చుతూ శనివారం 4 గంటలకు బలపరీక్ష నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. దీంతో సాయంత్రం 4గంటలకు బలపరీక్ష జరుగనుంది.
 
ఇందుకోసం అసెంబ్లీ ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. ప్రొటెం స్పీకర్ కేజీ బోపయ్య ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సాయంత్రం బలపరీక్ష ఉంటుంది. సీఎం యడ్యూరప్ప విశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. రహస్య ఓటింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతించక పోవడంతో… హెడ్ కౌంట్ నిర్వహించాల్సి ఉంటుంది. 
 
మరోవైపు బలపరీక్షలో నెగ్గుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం ఆదేశాలను శిరసావహిస్తామన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు కొందరు తమకు ఓటేస్తారని ఆయన పరోక్షంగా వెల్లడించారు. 
 
మరోవైపు, బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు శుక్రవారం  హైదరాబాద్‌లో క్యాంప్ పెట్టాయి. సిద్ధరామయ్య, కుమారస్వామి కూడా  హైదరాబాద్ వచ్చారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత శుక్రవారం (మే-18) అర్థరాత్రి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేల బృందం బయలుదేరింది. మొత్తం ఐదు బస్సులో ఎమ్మెల్యేలను తరలించారు. 
 
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు భారీ భద్రతను కల్పించారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ ఎమ్మెల్యేలతోపాటు తెలంగాణ చెందిన నేతలూ వెళ్లారు. ప్రస్తుతం కర్ణాటక పోలీసుల భద్రతలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేల వాహనాలకు ముందు వెనుకా కాంగ్రెస్‌ శ్రేణుల వావానాలు ఉన్నాయి. రోడ్డు మార్గంలో బస్సుల్లో బయలుదేరిన నేతలంతా సేఫ్‌గా శనివారం ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు.