1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Karnataka LIVE: Supreme Court Orders Floor Test in Assembly Tomorrow

కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్ : శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష

కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప సర్కారు చిక్కుల్లో పడనుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించ

Karnataka LIVE
కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప సర్కారు చిక్కుల్లో పడనుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష జరుగనుంది. పైగా, బలపరీక్షకు అవసరమైన భద్రతను కల్పించాల్సిందిగా కర్ణాటక డీజీపీకి ఆదేశించింది.
 
అదేసమయంలో కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షకు సమయం కావాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. బల పరీక్షను శనివారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించాలని ఆదేశించింది. అటార్నీ జనరల్ మాట్లాడుతూ బల పరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని బీజేపీ తరపు న్యాయవాది చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 
About Writer
pnr
తర్వాతి కథనం
బీజేపీకి సుప్రీంకోర్టు మరో షాక్ .. బలపరీక్షకు సిద్ధమన్న కాంగ్రెస్