గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (11:21 IST)

ఎమ్మెల్యేలతో ఇలా బేరసారాలా.. పాకిస్థాన్‌లా మారిపోయింది.. మమత.. రాహుల్ ఫైర్

దేశవ్యాప్తంగా కర్ణాటక రాజకీయాలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కర్ణాటక రాజకీయాలపై స్పందించారు. ఎమ్మెల్యేలతో ఇలా బేరసారాలు చేసే పద్ధతి దేశానికి మంచిది కాదని మమత తెలిపార

దేశవ్యాప్తంగా కర్ణాటక రాజకీయాలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కర్ణాటక రాజకీయాలపై స్పందించారు. ఎమ్మెల్యేలతో ఇలా బేరసారాలు చేసే పద్ధతి దేశానికి మంచిది కాదని మమత తెలిపారు.
 
తాము ప్రజాస్వామ్య పద్ధతులను ఎల్లప్పుడూ గౌరవిస్తామని, అయితే ఇలా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడితే అది దేశ పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రోజు అధికారంలో వుండే వారు రేపు వుండరని మమత గుర్తు చేశారు.
 
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పనిచేసినప్పటికీ తమ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ 90 శాతం సీట్లను గెలుచుకుందని, దీన్ని బట్టి తాము గ్రామస్థాయి నుంచి ఎంత బలంగా ఉన్నామో తెలుస్తోందన్నారు.
 
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై మాటల దాడిని తీవ్రతరం చేశారు. దేశంలో ఉన్న పరిస్థితులు పాకిస్థాన్‌లో మాదిరిగా ఉన్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ సుప్రీం కోర్టు జడ్జీలను కూడా భయపెడుతుందని.. ఇలాంటిది నియంతృత్వంలోనే జరుగుతుందన్నారు.
 
రాజ్యాంగంపైనే దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో ఒకవైపు ఎమ్మెల్యేలంతా నిలబడి ఉంటే, మరోవైపు గవర్నర్ ఉన్నారని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందన్న జేడీఎస్ ఆరోపణలను రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.