శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 మే 2018 (13:57 IST)

కర్ణాటక ఫైట్ : బీజేపీ నుంచి ఒక్కరు.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు అజ్ఞాతం

కర్ణాటక శాసనసభలో ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప బలపరీక్ష గడువు సమీపించే కొద్దీ ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కర్ణాటక శాసనసభలో ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప బలపరీక్ష గడువు సమీపించే కొద్దీ ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి ఆచూకీ తెలియడం లేదు. వీరిద్దరూ ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్‌ ఉన్నారు. వీరిద్దరూ ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు.
 
మరోవైపు, సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష జరగనుంది. మరోవైపు ఊహించినట్టుగానే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ ను ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే, ఈ ఇద్దరినీ బెంగుళూరులోని ఓ నక్షత్ర హోటల్‌లో బంధించివున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆనంద్ సింగ్ అసెంబ్లీకి వస్తారని, బలపరీక్షలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పారు. అయినప్పటికీ ఇంతవరకు ఆయన అసెంబ్లీకి రాకపోవడంతో, కాంగ్రెస్ నేతలు ఉత్కంఠకు గురవుతున్నారు. అలాగే, బీజేపీకి చెందన ఒక్క ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి కనిపించకుండా పోయారు. ఈ ముగ్గురు గోల్డ్‌ఫించ్ హోటల్ వద్ద ఉన్నట్టు సమాచారం.