1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TS DEECET Exam Pattern 2023 Preliminary Key Release

టీఎస్ డీఈఈ సెట్ ప్రిలిమినరీ కీ విడుదల

students
తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల డీఈడీ కోర్సులో చేరేందుకు నిర్వహించిన డీఈఈ సెట్‌ ప్రిలిమినరీ కీ విడుదలైంది. తెలంగాణ వ్యాప్తంగా జూన్‌ ఒకటో తేదీన ఈ పరీక్ష జరగ్గా 79.40 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష కోసం మొత్తం 6,485 మంది దరఖాస్తు చేసుకోగా.. 5,144 మంది పరీక్ష రాసినట్టు డీఈఈ సెట్‌ కన్వీనర్‌ శ్రీనివాసాచారి వెల్లడించారు. 
 
తాజాగా అధికారులు ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. ఈ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే జూన్‌ 8వ తేదీ సాయంత్రం 6 గంటల లోగా తెలపాలని విద్యార్థులకు సూచించారు. ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందాలనుకునేవారు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సు చదవాల్సి ఉంటుంది. 
తర్వాతి కథనం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల వృద్ధి కినారా క్యాపిటల్ ప్రణాళిక