సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (17:33 IST)

తెలంగాణ త్యాగధనులు వెబ్ సిరీస్ ప్రారంభం

Nagabala Suresh Kumar, Kurmachalam AND OTHERS
Nagabala Suresh Kumar, Kurmachalam AND OTHERS
తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన త్యాగధనులు కూడా ఎందరో వున్నారు. వారిలో కొందరి జీవిత చరిత్ర ఆధారంగా 'తెలంగాణ త్యాగధనులు' పేరిట వెబ్ సిరీస్ రూపుదిద్దుకోడానికి ఈ రోజు జూన్ 4న ఆదివారం సాయంత్రం ప్రారంభోత్సవం మరియు గీతావిష్కరణ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో ఎఫ్ డి సి చైర్మన్ కూర్మాచలం, దర్శకులు రేలంగి నరసింహారావు, నటి రోజారమణి, నిర్మాత రాజ్ కందుకూరి, వకుళా భరణం కృష్ణ మోహన్, తుమ్మలపల్లి  రామ సత్యనారాయణ, పాల్గొన్నారు.
 
దర్శకుడు నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ చరిత్ర ను ప్రపంచవ్యాప్తంగా అందించాలనే మన ఇంటి సినిమా థియేటర్ అయినా ఓ టి టి లో మీకు అందించడం కోసం వెబ్ తో ముందుకొచ్చాము. ఇవి 10 సీజన్లో  50 ఏపిసోడ్స్ అవుతాయో? లేక 100 సీజన్లో 500 ఏపిసోడ్స్ అనేది ఇప్పుడు చెప్పలేము. తెలంగాణ చరిత్ర తవ్వుకుంటూ పోతే చాలా వుంది.  ఇది కేవలం ఒక ప్రాంతానికి తెలియాల్సిన చరిత్ర కాదు  జాతీయ స్థాయిలో తెలియాల్సి సిరీస్ ఇది.   ఏ లాభాపేక్ష లేకుండా నిర్మాత  విజయ్ కుమార్ గారు ముందుకు రావడం ఆయనను అభినందించితీరాలి. మీరు అందరు మెచ్చిన ఈ గీతాన్ని రాసిన వెనిగళ్ల  రాంబాబు గారికి , దానికి స్వరాలు అందించిన ఖద్ధుస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. 
 
నిర్మాత వి విజయ్ కుమార్ మాట్లాడుతూ, "గత 30 సంవత్సరాలుగా నేను రియల్ ఎస్టేట్ రంగం లో వ్యాపారం చేస్తున్నాను. నిజానికి నేను వ్యాపార పరంగా ఆలోచిస్తే... ఓ కమర్షియల్ సినిమా తియ్యొచ్చు! ఆ సినిమా పై డబ్బు సంపాదించొచ్చు! కానీ అలాంటి సినిమా ఇలా వచ్చి అలా కనుమరుగవుతుంది. చరిత్రలో నిలిచిపోయే సబ్జెక్టులు కొన్నే ఉంటాయి అలాంటి గుర్తుండి పోయే సిరీస్ 'తెలంగాణ  త్యాగధనులు'. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సిరీస్ ని మీకు అందించాలనే సంకల్పం తో మీ ముందుకొచ్చాము ఆదరించండి! ఆశీర్వదించండి. ఈ వెబ్ సిరీస్ ఏ ఓటిటి కంపెనీ సొంతం చేసుకుంటుందో ఫస్ట్ సీజన్ షూటింగ్ పూర్తి అయ్యాక తెలియ చేస్తాం. " అన్నారు.