సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలి అనుకునే వారికి వారధిగా సినీప్రెన్యూర్ కంపెనీ
basireddy, RP patnayak and others
తెలంగాణా గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజ్‌గా తీసుకుని స్టార్టప్ కంపెనీలకు సపోర్టుగా నిలవాలనే ఉద్ధేశ్యంతో ప్రారంభించిన కేంద్రం టీ–హబ్. శుక్రవారం హైదరాబాద్‌లోని టీహబ్‌లో సినీప్రెన్యూర్ గ్రాడ్యుయేషన్ సెరిమనీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణా జయేష్ రంజన్, టీ–హబ్ సీఈవో యం.శ్రీనివాసరావు, తెలంగాణా ఎఫ్.డి.సి చైర్మెన్ అనిల్ కూర్మాచలం , తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ బసిరెడ్డి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్, సంగీత దర్శకుడు–నటుడు– ఆర్పీ పట్నాయక్, మీస్కూల్–సినీప్రెన్యూర్ ఫౌండర్ డైరెక్టర్ ప్రతిభ పులిజల తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ మాట్లాడుతూ– టీ–హబ్‌లో స్టార్టయిన సినిమా స్టార్టప్ కంపెనీ సినీ ప్రెన్యూర్. సినీ ప్రెన్యూర్ కంపెనీ ముఖ్య ఉద్ధేశ్యం సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలి అనుకునే వివిధ రంగాల వారికి బ్రిడ్జిగా నిలుస్తూ సినిమాకి సంబంధించిన అనేక మెళుకువలను చెప్పి వారికి సినిమాపట్ల పూర్తి అవగాహన కల్పిస్తూ ఇక్కడ గ్రాడ్యుయేట్స్‌గా వెళ్లిన వారందరూ సినిమా పరిశ్రమలో విజయ తీరాలకు చేరాలనేదే మా లక్ష్యం. సినిమా రంగంలో విశిష్టమైన పేరు ప్రఖ్యాతులున్న వారందరిని మెంటార్‌లుగా నియమించుకుని ఉదాహరణకు కెమెరా డిపార్ట్‌మెంట్‌కు కె.కె. సెంథిల్‌కుమార్ సినీ ప్రెన్యూర్‌కు అండగా నిలిచి సినీప్రెన్యూర్‌లో షార్ట్ టర్మ్ కోర్స్‌చేసిన వారికి కెమెరాపై అవగాహన కల్పించారు. అలాగే 24 శాఖలకు సంబంధించిన వారిని తమ ట్యూటర్స్‌గా పెట్టుకుని సినీప్రెన్యూర్‌లో కోర్స్ చే సిన వారందరికి సినిమా పట్ల, సినిమా రంగం పట్ల సరైన అవగాహన కల్పించాము. ఆ కోర్స్‌ను విజయవంతంగా పూర్తిచేసిన 11మంది గ్రాడ్యుయేట్స్‌కు జయేష్ రంజన్ గారి చేతులమీదుగా సర్టిఫికెట్ ప్రధానం చేయటం ఆనందంగా ఉంది అన్నారు.
జయేష్ రంజన్ మాట్లాడుతూ– మీ స్కూల్ ప్రోగ్రాం ద్వారా సినీప్రెన్యూర్‌లో మెంటార్‌షిప్ చేసిన వారందరికి డైరెక్టర్ ప్రతిభగారికి నా కృతజ్ఞతలు. తెలంగాణా గవర్నమెంట్ తరపునుండి క్రియేటివ్‌గా పనిచేసే వారందరికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అన్నారు.
టీ–హబ్ సీఈవో యం.శ్రీనివాసరావు మాట్లాడుతూ– టీహబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలకు సాయం చేస్తున్నాం. త్వరలోనే సినిమా పరిశ్రమకు చెందిన అనేక శాఖలకు గవర్నమెంట్ ద్వారా లక్ష యాభైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రీన్‌మ్యాట్, విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన స్టూడియోను రూపొందిస్తున్నాం అన్నారు.
ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ– ఈరోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఓ సాథియా నిర్మాత సుభాష్ కట్టాకు సినిమా ఇండస్ట్రీనుండి అలాగే తన సినిమా విడుదల అవ్వటానికి కావలసిన డిస్ట్రిబ్యూషన్ కూడా చేయటానికి సాయపడతాను అని మాటిస్తున్నాను అన్నారు.
ఆర్పీ.పట్నాయక్ మాట్లాడుతూ– తెలంగాణా ప్రభుత్వం నంది అవార్డులను సినిమా వారికి అందించేలా చర్చలు తీసుకొవాలని ప్రభుత్వ పెద్దలను కోరారు. అలాగే సినీప్రెన్యూర్‌కి ఖచ్చితమైన ట్యూటర్‌గా 24 శాఖలకు సంబంధించిన అన్ని విషయాలను టీచింగ్ చెస్తాను అన్నారు.
ఎఫ్.డి.సి చైర్మెన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ– గవర్నమెంట్ తరపునుండి మీ స్కూల్ డైరెక్టర్ ప్రతిభగారికి, సినీప్రెన్యూర్ టీమ్‌కి ఏ సాయం కావాలన్నా చేస్తామని హామి ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా సినీప్రెన్యూర్ స్టూడెంట్ ఓ సాథియా నిర్మాత సుభాష్ కట్టాను ఓసాథియా సినిమాలోని పాటను వీక్షీంచి చక్కని భవిష్యత్తు ఉన్న నిర్మాతగా ఎదగాలని పలువురు ఆకాక్షించారు.