సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (16:50 IST)

డీజే టిల్లు సిద్ధు నడిచిన టిల్లు స్క్వేర్ విడుదల తేదీ ప్రకటన

Sidhu, Anupama Parameswaran
Sidhu, Anupama Parameswaran
డీజే టిల్లు' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న సిద్ధు, అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు యువతరం మెచ్చే కథాబలమున్న మీడియం బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మిస్తున్నాయి. ఇప్పుడు నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా 'టిల్లు స్క్వేర్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు  సిద్దు  'టిల్లు స్క్వేర్'తో రెట్టింపు వినోదాన్ని పంచడానికి స్టార్ నటి అనుపమ పరమేశ్వరన్ తోడయ్యారు.
 
ఈ సినిమాని 2023, సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించిన చిత్ర బృందం, సిద్ధు-అనుపమ పరమేశ్వరన్‌ ల రొమాంటిక్ పోస్టర్‌ ను విడుదల చేసింది. ఈ చిత్రం మొదటి భాగాన్ని మించి రెట్టింపు వినోదాన్ని, థ్రిల్ ని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.