1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TSRTC Decided to sell Vajra Busses through Tender

వజ్ర బస్సులను వదిలించుకునే దిశగా టీఎస్ఆర్టీసీ

Vajra Busses
ప్రయాణకులకు అత్యాధునిక ప్రయాణ సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ఆర్టీసీ వజ్ర పేరుతో కొత్త బస్సులను తీసుకొచ్చింది. అయితే, ఈ బస్సులు ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఈ వజ్ర బస్సులను వదిలించుకోవాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. 
 
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఇళ్ల నుంచి ఎక్కించుకుని తీసుకెళ్లేలా ఈ బస్సులను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు నాన్‌స్టాప్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. 21 సీట్లు ఉన్న ఈ బస్సుల్లో యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టారు.
 
కానీ, సాధారణ బస్సులతో పోలిస్తే ఇందులో చార్జీలు దాదాపు రెండింతలు ఉండటంతో ప్రయాణికుల నుంచి ఆదరణ కరవైంది. వీటి నిర్వహణ భారంగా మారడంతో వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది. 
 
ఈ బస్సులు 100 వరకు ఉండగా ఆదరణ కరవవడంతో 65 మూలనపడ్డాయి. ఈ నేపథ్యంలో స్క్రాప్ యార్డ్ విభాగం ద్వారా వాటి ప్రస్తుత విలువను అంచనా వేసి అనంతరం బహిరంగ వేలానికి టెండరు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పెగాసస్ లక్ష్య జాబితాలో అనిల్ అంబానీ