సంబంధిత వార్తలు
- చెన్నైలో ఇద్దరు జర్నలిస్టులకు కరోనా ... పుట్టగొడుగుల్లా కొత్త కేసులు
- పిజ్జా తినకపోతే చచ్చిపోతామా? ఇంట్లోనే ఎల్లిపాయ మిరం తినొచ్చుగా : సీఎం కేసీఆర్
- చెన్నై మహానగరానికి ఏమైంది? పుట్టగొడుగుల్లా "కరోనా" కేసులు
- తెలంగాణాలో మే 7వ వరకు లాక్డౌన్ పొడగింపు?
- కరోనా విముక్త రాష్ట్రంగా గోవా ... పాజిటివ్ కేసులన్నీ నెగెటివ్లే...
తెలంగాణాలో విషాదం : కరోనా వైరస్ సోకి రెండేళ్ళ బాలుడు
తెలంగాణా రాష్ట్రంలో విషాదం జరిగింది. కరోనా వైరస్ సోకి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూరు మండలంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మద్దూరు మండలంలోని నారాయణపేటకు చెందిన రెండేళ్ళ బాలుడు న్యూమోనియాతో బాధపడుతుంటే నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ వైద్యుల సూచన మేరకు ఆ బాలుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది.
దీంతో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తూ రాగా, ఆ బాలుడు చికిత్స పొందుతూ కన్నుమూశారు. అతని తండ్రి ద్వారానే బాలుడికి కరోనా వైరస్ సోకివుంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతుని తల్లిదండ్రులకు కూడా ఈ పరీక్షలు చేస్తున్నారు.