శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (14:23 IST)

కన్నతండ్రి కాదు కామాంధుడు.. కన్నబిడ్డపై పలుమార్లు అత్యాచారం..

కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరుసలు లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. కన్న పేగును పంచిన కన్న తండ్రి కూతురుపై కామంతో రెచ్చిపోయాడు. అంతేకాదు పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు ఆ భాధలు భరించలేక చనిపోవాలని అనుకుంది. ఓ రోజు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్న కూతురును తల్లి గమనించి నిలదీసింది. దాంతో తండ్రి తన పై చేస్తున్న దారుణం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే... నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ ఏరియా కపిల్ నగర్‌కి చెందిన న్యాయవాది వరంగల్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన లాయర్ కీచకుడిగా మారాడు. పదో తరగతి చదువుతున్న కన్నకూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను బెదిరించి నిత్యం అత్యాచారం చేస్తున్నాడు. తండ్రి నీచమైన పని భరించలేకపోయిన కూతురు ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో తల్లి నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై బాధితురాలి తల్లి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన నీచానికి తగిన బుద్ది చెప్పాలని పోలీసులను డిమాండ్ చేస్తోంది.