1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Actress Nikesha Patel comments on Co-existence

నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తా.. ఇందులో తప్పేముంది : నికిషా పటేల్‌

తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని, ఇందులో తప్పేముందని నికిషా పటేల్ అంటోంది. ఈ ముద్దుగుమ్మ వివాహ బంధంపై స్పందిస్తూ.. భార్యాభర్తలుగా జీవించేందుకు పెళ్లి బంధం అక్కర్లేదన్నదే నా అభిప్రాయం. పెళ్లితో

Actress Nikesha Patel
తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని, ఇందులో తప్పేముందని నికిషా పటేల్ అంటోంది. ఈ ముద్దుగుమ్మ వివాహ బంధంపై స్పందిస్తూ.. భార్యాభర్తలుగా జీవించేందుకు పెళ్లి బంధం అక్కర్లేదన్నదే నా అభిప్రాయం. పెళ్లితో వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్న నమ్మకం లేదు. 2030 సంవత్సరానికల్లా మన దేశంలో పెళ్లి అనే బంధం స్థానంలో సహజీవనశైలి పెరుగుతుందని నమ్ముతున్నా. నాకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని చెప్పారు. 
 
కాగా, గతంలో ఎస్‌జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'పులి' చిత్రంతో ఈ అమ్మడు వెండితెరకు పరిచయమైంది. ఈమె తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. ఆ తర్వాత 'తలైవన్‌'తో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత 'ఎన్నమో ఏదో', 'కరైఓరం', 'నారదన్‌' చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో '7 నాడ్కల్‌' చిత్రంలో నటిస్తున్నారు. 
 
గౌతం దర్శకత్వంలోని ఈ సినిమాలో శక్తి హీరోగా నటిస్తోంది. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చినప్పటికీ నటించలేదు. దీనిపై స్పందిస్తూ.. చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మళ్లీ నటిస్తున్నా. త్వరలోనే పెద్ద హీరోలతో జతకడతానన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేసింది. 
About Writer
pnr
తర్వాతి కథనం
హృతిక్ 'కాబిల్' మూవీకి కాపీ మరక.. యాక్షన్ సీన్స్‌ను అచ్చుగుద్దినట్టుగా తీశారా?