1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Actress Sreeleela ropes in Prabhas' Raja Deluxe

ప్రభాస్ సరసన పెళ్లి సందడి హీరోయిన్ రొమాన్స్?!

Actress
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పెళ్లి సందడి హీరోయిన్ కలిసి నటించనుంది. దర్శకుడు మారుతీ డైరెక్షన్‌లో ప్రభాస్ కామెడీ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు రాజా డీలక్స్ అని పేరు కూడా పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల కనిపించనునందట.
 
మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా డైరెక్టర్లను కూడా బుట్టలో వేసుకున్న ఈ బ్యూటీ ఇటీవలే రవితేజ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇంతలో ప్రభాస్ సరసన ఛాన్స్ పట్టేసి గోల్డెన్ గర్ల్‌గా మారిపోయింది. 
 
ఇక ఇందులో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్‌తో రొమాన్స్ చేయనున్నారట. శ్రీలీల ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోగా రెండో హీరోయిన్‌గా మెహరీన్‌ని తీసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారట మేకర్స్. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వరుణ్ తేజ్ గ‌ని సెన్సార్ పూర్తి - ఈనెల 25న విడుద‌ల‌