సంబంధిత వార్తలు
- మెర్సల్: ఓవర్సీస్ కలెక్షన్స్ అదిరింది.. రూ.211 కోట్ల గ్రాస్.. కబాలికి తర్వాత?
- సినిమా అంటేనే ఊహాజనితం.. నచ్చకపోతే చూడొద్దు : మద్రాసు హైకోర్టు
- నేను శంకర్ శిష్యుడ్ని... అలా కాకుండా ఎలా తీస్తాను? 'మెర్సల్' దర్శకుడు
- 'మెర్శల్' ఎఫెక్ట్ : పన్ను ఎగ్గొట్టిన హీరో విశాల్... ఐటీ తాఖీదులు
- నటుడిగా కాదు.. ఇక నాయకుడుగా కనిపించాలి : హీరో విజయ్ తండ్రి
విజయ్ 'అదిరింది'కి అరవింద్ అడ్డుపడుతున్నారట... ఎందుకో తెలుసా?
తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ తమిళ చిత్రం ఎంతటి హిట్ కొట్టిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మెర్సల్ చిత్రం వివాదంలో చిక్కుకోవడం, దానికి బాగా హైప్ రావడం, కేంద్రం ప్రవేశపెట్టిన జిఎస్టీపై
తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ తమిళ చిత్రం ఎంతటి హిట్ కొట్టిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మెర్సల్ చిత్రం వివాదంలో చిక్కుకోవడం, దానికి బాగా హైప్ రావడం, కేంద్రం ప్రవేశపెట్టిన జిఎస్టీపై విమర్శనాస్త్రాలు బాగా పనిచేయడంతో చిత్రం ఎక్కడికో వెళ్లిపోయింది. కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది.
ఐతే తెలుగులో విడుదల కావాల్సిన అదిరింది చిత్రం మాత్రం విడుదల కాలేదు. దానికి పలు కారణాలు చెపుతూ వచ్చారు. భాజపా నాయకులు అడ్డుపడ్డారని ఒకరంటే సెన్సార్ కష్టాలు అని మరికొందరు చెప్పారు. కానీ తాజాగా దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో వార్త హల్చల్ చేస్తోంది. విజయ్ అదిరింది చిత్రం హక్కులు ప్రముఖ నిర్మాత శరత్ మరార్ వద్ద వున్నాయట.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని విడుదల చేయవద్దని మరో అగ్రనిర్మాత అల్లు అరవింద్ అడ్డుకుంటున్నారట. దానికి కారణం... ఈ చిత్రాన్ని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‍తో రీమేక్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అదే నిజమైతే 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేనకు ఈ చిత్రం పెద్ద బూస్ట్ కావడం ఖాయం.
తర్వాతి కథనం
