సంబంధిత వార్తలు
- '2.O' ఓ ఇమాజినేషన్ మూవీ.. సౌత్ సత్తా చూపిస్తాం : శంకర్ (Video)
- సమంతను తీసుకుందామన్న బన్నీ.. త్రిషనే బెస్ట్ అంటోన్న ప్రేమ్..?
- అల్లు అర్జున్ అంటే క్రష్.. పవన్‌తో ఆ ఛాన్స్ వస్తే.. ప్రియాంక జవల్కర్(Video)
- ఇక్కడ #MeToo కి స్థానం లేదు... అల్లు అర్జున్ ఏమన్నారంటే...?
- బన్నీ మీద నాకు క్రష్ వుంది... హీరోయిన్ ప్రియాంక
డైరెక్టర్‌కి కథ వినిపించిన అల్లు అర్జున్... ప్లాన్ అదిరింది..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఏదో సినిమా చేసేయాలని కాకుండా సరైన కథతోనే రావాలని చూస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నాడు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. కథ విషయంలో త్రివిక్రమ్‌తో చర్చలు జరుగుతున్నాయి. అయితే.. బన్నీ ఈసారి సినిమా సినిమాకి గ్యాప్ లేకుండా అభిమానులను ఎంటర్టైన్ చేయడం కోసం మరో సినిమాని కూడా లైన్లో పెట్టబోతున్నాడట.
ఇంతకీ మరో సినిమా ఎవరితో అంటారా..? ఇటీవల తమిళ రైటర్ బన్నీకి ఓ కథ చెప్పారట. ఈ కథ బన్నీకి చాలా బాగా నచ్చేసిందట. ఈ కథను విక్రమ్ కుమార్‌కి వినిపించారట. ఈ కథను డైరెక్ట్ చేస్తారా అని అడిగారట. విక్రమ్ కుమార్ వేరే కథతో తను సినిమా చేయడమా అని ఆలోచనలో పడ్డాడట కానీ.. బన్నీతో ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతుండటంతో కాదనలేక ఓకే చెప్పాడట. సో.. ఈ విధంగా ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేయాలి అని పక్కా ప్లాన్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్న బన్నీ ప్లాన్ అదిరింది కదా..!
తర్వాతి కథనం
