గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (12:52 IST)

'2.O' ఓ ఇమాజినేషన్ మూవీ.. సౌత్ సత్తా చూపిస్తాం : శంకర్ (Video)

ఈనెల 29వ తేదీన విడుదలకానున్న "2.O" చిత్రం కథను ఆ చిత్ర దర్శకుడు శంకర్ వెల్లడించాడు. ఇలా నడిస్తే ఎలా ఉంటుంది.. అని ఒక ఊహాజనితంగా సాగే కథే '2.O' అని చెప్పారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్ వేదికగా జరిగింది. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన ప్రసంగం ద్వారా '2.O' గురించి కాస్త వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. తనకొచ్చిన ఒక ఇమాజినేషనే '2.O'కి మూలం అని చెప్పారు. సినిమా కోసం రజినీ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యలేదని, అక్షయ్ మేకప్ కోసం చాలా కష్టపడ్డాడని, సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందన్నారు. 
 
అయితే, ఈ చిత్రాన్ని 2డిలో కంటే 3డిలో చూస్తే పదిరెట్లు అద్భుతంగా ఉంటుందన్నారు. మీడియా ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేస్తే, మన కంట్రీలో కూడా ఇలాంటి సినిమా చెయ్యొచ్చని మనం వరల్డ్‌కి ప్రూవ్ చెయ్యొచ్చు అంటూ సినిమా సక్సెస్‌పై శంకర్ ధీమా వ్యక్తంచేశారు. శంకర్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఓసారి తిలకించండి.