శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : సోమవారం, 26 నవంబరు 2018 (15:59 IST)

స్టార్ ఓటర్స్ : తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు సినీ తారల కళ...

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డిసెంబరు ఏడో తేదీన జరుగనుంది. ఇందుకోసం ఆయా పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా, ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో పలువురు సినీ స్టార్స్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
ఇలాంటివారిలో హీరోలు జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, మహేష్ బాబు, అల్లు అర్జున్, సమంతలతో పాటు నాటి, నేటి వర్ధమాన సినీ తారలు, దర్శకులు, గాయకులు, సంగీత దర్శకులు ఉన్నారు. ఇందుకుకారణం తెలుగు చిత్రపరిశ్రమ అంతా అక్కడ ఉండటమే కారణం. 
 
ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక విశేషమేమంటే హీరోయిన్‌ సమంత అక్కినేని ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉండటం. వీరిలో ఎంతమంది ఓటు వేస్తారో తెలియకపోయినా కొందరైనా పోలింగ్‌లో పాల్గొనే అవకాశముంది. సినీ దిగ్గజాలంతా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు రానుండటంతో పోలింగ్‌ కేంద్రాలు కళ సంతరించుకోనున్నాయనే చెప్పవచ్చు.
 
తారలోకమంతా జూబ్లీహిల్స్‌లోనే...
నట దిగ్గజాలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, నేపథ్య గాయనీ గాయకులు ఇలా ఎంతో మంది నగరంలోనే ఓటుహక్కు కలిగి ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లో నివసించే జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ తేజ్, దగ్గుబాటి రానా, వెంకటేశ్, నాగార్జున, అక్కినేని అమల, అఖిల్, నాగచైతన్య, చిరంజీవి, నాగబాబు, మహేశ్‌బాబు, అల్లరి నరేశ్, ఆర్యన్‌ రాజేష్, కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, శివాజీరాజా, నరేష్‌ తదితరులు ఇక్కడ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
 
అలాగే, హీరో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కూడా ఈ దఫా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక జీవితా రాజశేఖర్‌ ప్రతి ఎన్నికల్లోనూ క్రమం తప్పకుండా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈసారి వారి కూతుళ్లకు కూడా ఓటుహక్కు రావడం విశేషం. హీరోలు సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్, తరుణ్‌ తదితరులు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు. నాగార్జున దంపతులు ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.