మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 26 నవంబరు 2018 (08:59 IST)

రండి.. ఓటుతో మన భవిష్యత్తును నిర్మించుకుందాం : పాయల్ రాజ్‌పుత్

'ఆర్ఎక్ 100' చిత్రంలో అందాలను ఆరబోతతోపాటు గాఢ చుంభనాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రం ఈమెకు టాలీవుడ్‍లో తొలి చిత్రం. అయినప్పటికీ ఆమె నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా, ఈ చిత్రంలో ఆమె పాత్ర, అందాల ఆరబోత తదితర అంశాలు అదుర్స్. 
 
ఈ క్రమంలో ఓటు విలువను తెలియజెప్పేలా ఓ సందేశం ఇచ్చారు. ఓటు అనేది మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. దీనివల్ల కేవలం మనలను పాలించడానికి నాయకులను మాత్రమే ఎన్నుకుంటామని భావిస్తే అది పొరపాటే అవుతుంది. మన భవిష్యత్తును ఓటుతో నిర్మించుకుంటున్నామనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలి. ఓటు హక్కు మన పౌరసత్వాన్ని మరోమారి గుర్తుచేస్తుంది. మన ఒక్క ఓటు జీవితాలను మార్చుతుందా అని భావించరాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటూ కీలకమైనదే అని పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఈ అమ్మడు తాజా ఓ గోల్డెన్ ఛాన్స్ కొట్టిసినట్టు ఫిల్మ్ నగర్‌ల జోరుగా ప్రచారం సాగుతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్వర్గీయ ఎన్టీరామారావు బయోపిక్ మూవీలో పాయల్‌ను ఓ పాత్రకు ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఆ చిత్ర నిర్మాత, హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ స్పందించాల్సి వుంది.