సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 25 నవంబరు 2018 (13:22 IST)

ఎన్టీఆర్ బయోపిక్‌లో పాయల్ రాజ్ పుత్...

ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండో సినిమాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో బాలయ్య తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు.
 
ఎన్టీఆర్ పా్ర కోసం బాలయ్య విశ్రాంతి తీసుకోకుండా చాలా కష్టపడుతున్నారు. వివిధ కోణాల్లో కనిపించేందుకు బాలయ్య కసరత్తు చేస్తున్నారు. ఈ సినిమాలో విద్యాబాలన్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ వంటి నటీమణులు ప్రత్యేక పాత్రలతో అలరించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విద్యాబాలన్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 
 
వీరితో తాజాగా ఆరెక్స్ హీరోయిన్ కూడా పాయల్ కూడా చేరనుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారును కట్టిపడేసిన పాయల్ రాజ్ పుత్, ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్లు వస్తున్నప్పటికీ అమ్మడు ఎన్టీఆర్ బయోపిక్ ఆఫర్‌ను ఓకే చేసిందట. ఎన్టీఆర్ సినిమాలో జయప్రద క్యారెక్టర్ కోసం క్రిష్ ఆమెను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కీలక సీన్స్ బాలయ్య, పాయల్‌పై క్రిష్ తీయనున్నట్లు సమాచారం.