సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 12 నవంబరు 2018 (13:42 IST)

ఎన్టీఆర్ బయోపిక్ వాయిదాపడినట్టేనా?

స్వర్గీయ ఎన్టీరామారావు జీవితం, రాజకీయ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు, రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు పేరుతో రానుంది. 
 
ఇందులో తొలిభాగంగా వచ్చే యేడాది జనవరి 9వ తేదీన విడుదల కానుంది. అలాగే, రెండోభాగం కూడా జనవరి 24వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ, ఈ విడుదల తేదీపై పంపిణీదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకుంటే.. తొలి భాగం విడుదల తేదీకి రెండో భాగం విడుదల తేదీకి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉండటమే. 
 
దీంతో రెండో భాగాన్ని ఫిబ్రవరి నెలకు పోస్ట్ చేసినట్టు సమాచారం. ఇదే విషయాన్ని దర్శకుడు క్రిష్, నిర్మాత, హీరో బాలకృష్ణలు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఒకవేళ సినిమా పోస్ట్ ఫోన్ చేస్తే.. ఫిబ్రవరి 14వ తేదీన సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో సమాచారం.