Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?
Updated: Tue, 8 Sep 2026 (18:38 IST)
అజాద్ హింద్ ఫౌజ్ స్పూర్తితో తెరకెక్కుతున్న చిత్రం ఫౌజీ. ఇందులో బ్రిటీష్ కాలంనాటి కథను మిళితం చేసి తీస్తున్నారు. ఇటీవలే ఆలయంలో దేవుడి విగ్రహాన్ని పట్టుకున్న వస్తుండగా ప్రభాస్ పై సీన్స్ చిత్రీకరించారు. బ్రిటీష్ పోలీసులు ఆయన్ను అడ్డుకున్న సందర్భాలను కూడా తీశారు. తాజాగా కోటి ఉమెన్ కాలేజీతోపాటు హైదరాాబాద్ శివార్లో షూటింగ్ చిత్రీకరించారు. తాజాగా చిన్న బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం: సెప్టెంబర్ 15 వరకు షూటింగ్ గేప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చివరి దశలో షూట్: రెబల్ స్టార్ ప్రభాస్‌కు సంబంధించి ఈ సినిమాలో ఇంకా కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.
మరోవైపు హాలీవుడ్ రేంజ్ VFX: షూటింగ్ పెండింగ్ ఉన్నప్పటికీ, సినిమాకు సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని భారీ యాక్షన్ బ్లాక్స్ కోసం అమెరికా (US)కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ VFX కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. ఈ పీరియాడిక్ ఎపిక్‌ను గ్రాండ్ విజువల్ వండర్‌గా స్క్రీన్‌పైకి తీసుకురావడానికి మైత్రి మూవీ మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి