శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 11 అక్టోబరు 2019 (20:03 IST)

గర్ల్ ఫ్రెండ్‌తో అది చేస్తున్నారా.. సేఫ్టీ ఫస్ట్ అంటున్న పాయల్ రాజ్ పుత్

ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది హీరోయిన్ పాయల్. అయితే ఆ తరువాత ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ముద్దు సీన్లతో అదరగొడుతూ హాట్ హాట్ సీన్లలో నటిస్తూ యువ ప్రేక్షకులను ఈమె ఉర్రూతలూగిస్తోంది.
 
అయితే పాయల్ రాజ్ పుత్ తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆర్డీఎక్స్ లవ్ సినిమాలో నేను హీరోతో కలిసి నటించేటప్పుడు నీకు మూడ్ వస్తే సేఫ్టీ వాడు అని దర్శకుడు బహిరంగంగా చెప్పాడు. నేను దాన్ని చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నాను. 
 
మీరు కూడా ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్‌తో శృంగారం చేయాలనుకుంటే ఖచ్చితంగా సేఫ్టీ తీసుకెళ్లండి.. అది ముఖ్యం. ఏది మర్చిపోయినా అది మాత్రం మర్చిపోవద్దంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.