సంబంధిత వార్తలు
- షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం..
- జీవితాల్లో రంగులు నింపాలి.. భవనాలకు రంగులు వేయడం కాదు : జీవీఎల్
- వైద్యులకు ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్.. కనీస చార్జీ లేకుండానే ఫ్లైట్ జర్నీ!!
- అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలే : జీవీఎల్
- బన్నీ పుష్ప గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్, యాంకర్ సుమ నటిస్తుందట
వయస్సు పెరుగుతున్న కొద్దీ అందంగా మారుతున్న హీరోయిన్
సాధారణంగా వయస్సు పెరిగితే అందం తగ్గుతుందంటారు. ముఖం ముడతలు పడి అందం విహీనంగా మారుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక సీనియర్ హీరోయిన్లయితే చెప్పనవసరం లేదు. పెళ్ళి తరువాత పిల్లల పోషణ చూసుకోవడం, హెల్త్ గురించి మర్చిపోవడం మామూలే.
కానీ అందాల రాశి మాత్రం తన వయస్సు పెరుగుతున్నా ఆమె మాత్రం తన అందానికి ఏ మాత్రం లోటు రానివ్వడం లేదు. జూలై 29వ తేదీకి రాశికి సరిగ్గా 40 సంవత్సరాలు నిండుతుంది. వివాహమైన తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
అయితే యుట్యూబ్‌లో మాత్రం అప్పుడప్పుడు వీడియోలు పెట్టి అభిమానులను అలరించారు. చిన్నతనం నుంచే చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగ ప్రవేశం చేసిన రాశి అనతికాలంలోనే హీరోయిన్‌గా మారి అగ్రస్థానానికి చేరింది.
అయితే కరోనా లాక్ డౌన్ తరువాత మళ్లీ ఆమె సినిమాల్లోకి వస్తోంది. అది కూడా పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించబోతోంది. ఇప్పటికే రాశి ఫోటోలు ఇన్‌స్టాగ్రాంలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె పోలీసు అధికారిణిగా నటిస్తున్న కొన్ని సీన్లకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వయస్సులో కూడా రాశి అందం తరగలేదంటూ అభిమానులు పోస్టులు చేసేస్తున్నారు.
