జీవితాల్లో రంగులు నింపాలి.. భవనాలకు రంగులు వేయడం కాదు : జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మొట్టికాయలు తప్పవని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు. పంచాయతీ భవనాలకు అధికార వైకాపా పార్టీ జెండా గుర్తులను వేసిన కేసులో సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకు మరోమారు భంగపాటు తప్పలేదు.
ఈ అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీనిపై జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైందన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిర్ధారించిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంమొండిగా వ్యవహరిస్తే.. ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని ప్రభుత్వం తెలుసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం చేయాల్సింది ప్రజల జీవితాల్లో రంగులు నింపడమే తప్ప.. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం కాదని జీవీఎల్ పేర్కొన్నారు.