సంబంధిత వార్తలు
- ఏపీ అసెంబ్లీని ప్రోరోగ్ చేసిన గవర్నర్ .. ఆర్డినెన్స్ జారీకి వ్యూహం
- కాంట్రాక్టు ఉద్యోగులపై సీఎం జగన్ 'రివర్స్' అస్త్రం
- సెలెక్ట్ కమిటీని నియమిస్తావా... చర్యలు తీసుకునేనా... మండలి ఛైర్మన్ హుకుం
- ఏపీ రాజధాని నిర్ణయం రాష్ట్రమే చూసుకుంటుంది... మాకు సంబంధం లేదన్న కేంద్రం
- ఆంధ్రాలో బీటెక్ కోర్సులకు రూ.2 లక్షల ఫీజు?
పట్టపురాణిని నిర్ణయించేంది రాజే కదా? జీవీఎల్ నరసింహా రావు
రాణులు ఎంతమంది ఉన్నప్పటికీ పట్టపురాణిని మాత్రం నిర్ణయించేంది మాత్రం రాజేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు చెప్పుకొచ్చారు. అలాగే, రాజధానులు ఎన్నివున్నా.. సచివాలయం ఎక్కడ ఉంటుందే అదే రాజధాని అవుతుందనీ, దాన్ని నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వమేనని జీవీఎల్ వ్యాఖ్యనించారు.
మూడు రాజధానుల అంశంపై ఆయన మాట్లాడుతూ, రాజధాని అంశాన్ని అడ్డుపెట్టుకుని తెదేపా నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తాను బీజేపీకి స్పెషల్ ఏజెంటునని ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు.
ఇకపోతే, మూడు రాజధానుల అంశంలో కేంద్రమంత్రులు చెప్పిన మాటలే తాను కూడా చెప్పానని, అది కొందరికి నచ్చక వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని ఆరోపించారు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని జీవీఎల్ స్పష్టం చేశారు.
ఏపీ రాజధాని గురించి చెబుతూ, సాధారణంగా రాష్ట్ర సచివాలయం ఎక్కడ ఉంటే దాన్నే రాష్ట్ర రాజధానిగా భావించాల్సి ఉంటుందని అన్నారు. రాణులు ఎంతమంది ఉన్నా పట్టపురాణిని నిర్ణయించేది రాజేనని, రాష్ట్ర రాజధాని వ్యవహారం కూడా అంతేనని స్పష్టం చేశారు. ఏపీలో రాజధానులు ఎన్ని ఉన్నా ప్రధాన రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు.
