Allu Arjun: అరుదైన మైలురాయిని చేరుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్
Allu Arjun
దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 400కు పైగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, సుమారు లక్ష మంది యువతులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించింది. యువతులు, బాలికలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో అల్లు అర్జున్ అభిమానులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇక, అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో రాకా అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖ తారలు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
