1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Roja Selvamani as judge, Jabardasth on coronavirus

కరోనావైరస్ పైన జబర్దస్త్, జడ్జిగా రోజా సెల్వమణి

Roja Selvamani
జబర్దస్త్ ఎపిసోడ్ వస్తుందంటే చాలు, జనం టివీలకు అతుక్కుపోతారు. అన్‌లిమిటెడ్ కామెడీ.. స్కిట్లతో కంటెన్స్టెంట్ల హడావిడి కనిపిస్తుంటుంది. అయితే కరోనా పుణ్యమా అని పాత ఎపిసోడ్‌లను రీప్లే చేశారు. అయితే మళ్ళీ ఎపిసోడ్లు ప్రారంభమయ్యాయి. 
 
ఈ నెల 25వ తేదీ నుంచి జబర్దస్త్ ఫ్రెష్‌గా స్టార్ట్ కాబోతోంది. ఇందులో రోజా మళ్ళీ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జడ్జిగా ఆమె వ్యవహరించబోతున్నారు. మొత్తం ఆరు టీంలు మరోసారి తమ సత్తా చాటబోతోంది. ఈసారి ఏకంగా కోవిడ్-19 పైనే సెటైర్లు వేస్తూ స్కిట్లు ఉంటుందంటున్నారు నిర్వాహకులు.
 
అయితే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ హిమజ. బిగ్ బాస్ ఫేమ్ హిమజ హైపర్ ఆది టీంలో కనిపించబోతోంది. ఆమె వెరైటీగా ఎపిసోడ్లలో కనిపించబోతోంది. ఇక జడ్జిలలో మనో కొనసాగనున్నారు. టీంలు మాత్రం అందరూ వాళ్ళే. ఈ నెల 25వతేదీ నూతన ఎపిసోడ్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.
తర్వాతి కథనం
ఆ విషయం తెలిసి పవన్‌తో నటించనని చెప్పిందట శృతిహాసన్