శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మే 2020 (11:51 IST)

అలాంటి వాళ్లను చంపేసినా పాపం లేదు.. జబర్దస్త్‌ ప్రియాంక

జబర్దస్త్‌ కామెడీ షోలో ఒకరైన సాయితేజ అలియాస్‌ ప్రియాంక వేధింపులకు గురైంది. జబర్దస్త్‌ షోలో చేసిన ఈయన కూడా ఒకడు. కానీ ఇప్పుడు ఆమె అయ్యాడు. అలాగే సాయితేజ బదులు ప్రియాంక అని పేరు కూడా మార్చుకున్నాడు. 
 
జబర్దస్త్‌ స్టేజిపై చేసే కామెడీ అంతా ఇంతా కాదు. కమెడియన్లకు నిజ జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. తెరముందు అందరిని నవ్విస్తుంటారు కానీ.. తెరవెనుక ఎన్నో కష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా మంది వారు పడుతున్న బాధలను చెప్పుకొంటుంటారు.
 
ఈ నేపథ్యంలో గత మూడు రోజుల క్రితం తనతో కొందరు అభ్యంతరంగా ప్రవర్తించారు. అర్ధరాత్రి సమయంలో నడి రోడ్డుపై బైక్‌ నిలిపివేసి చాలా దారుణంగా ప్రవర్తించారు అంటూ వాపోయింది. 
 
అర్థరాత్రి సమయంలో స్కూటీపై వస్తుంటే వాళ్లు తనను చూసి కామెంట్స్‌ చేశారని, అలాంటి వాళ్లను చంపేసినా పాపం లేదని మండిపడింది. అర్థరాత్రి సమయంలో నడిరోడ్డుపై ఇలా ప్రవర్తించడం ఎంత సమంజసమని అంటోంది.