శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (10:01 IST)

కరణ్ జోహార్ కరోనా షార్ట్ ఫిల్మ్.. సూపర్ స్టార్లందరూ ఏకమైన వేళ

Amitab
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న వేళ, ఇళ్లలోనే వుండాలనే సందేశాన్ని ఇచ్చే షార్ట్ ఫిల్మ్ ఇస్తుంది. కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జొహార్, వివిధ భాషల్లోని సూపర్ స్టార్ లను భాగం చేస్తూ నిర్మించిన 'ఫ్యామిలీ' సోనీ టీవీలో విడుదల కాగా, అప్పటి నుంచి లక్షల వ్యూస్ సాధిస్తూ, ట్రెండింగ్‌లో నిలిచింది. 
 
ఈ షార్ట్ ఫిలిమ్‌లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, ప్రియాంకా చోప్రాలు కనిపిస్తారు. వీరితో పాటు ఈ షార్ట్ ఫిల్మ్‌లో మమ్ముట్టి, రణబీర్ కపూర్, అలియా భట్, ప్రసేన్ జిత్ ఛటర్జీ, శివరాజ్ కుమార్, సోనాలీ కులకర్ణి, దల్జిత్ దోస్నాజ్ తదితరులు కూడా నటించడం విశేషం.
 
అలాగే షార్ట్ ఫిలిమ్‌లో ఇంటిపెద్దగా అమితాబ్ బచ్చన్ వుంటారు. తన సన్ గ్లాసెస్‌ను ఎక్కడో పడేసుకుని, వాటిని వెతికే పనిలో ఉండటంతో మొదలయ్యే షార్ట్ ఫిల్మ్, దాన్ని కనుగొనేందుకు పలు భాషలకు చెందిన నటీ నటులు ప్రయత్నించడం, చివరకు సన్ గ్లాసెస్ దొరకడం, ఆపై అమితాబ్ ఇచ్చే చిన్న సందేశంతో ముగుస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అమితాబ్ సందేశాన్ని ఇచ్చారు. ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.