శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (16:41 IST)

ఆ విషయం తెలిసి పవన్‌తో నటించనని చెప్పిందట శృతిహాసన్ (video)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రానికి ఏంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం.
 
బాలీవుడ్లో సక్సెస్ సాధించిన పింక్ మూవీకి ఇది రీమేక్ కావడంతో... టాలీవుడ్లో కూడా ఈ మూవీ సక్సెస్ సాధించడం ఖాయమని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. దీనికి సన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే... ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఉందని.. ప్రముఖ హీరోయన్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే... పవన్ సరసన ఇందులో ఎవరు నటిస్తారు అంటే... లావణ్య త్రిపాఠి, శృతి హాసన్ పేర్లు వినిపించాయి.
 
ఆ తర్వాత శృతిహాసన్ దాదాపు కన్ఫర్మ్ అంటూ ప్రచారం జరిగింది. దీనికితోడు స్వయంగా ఈ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా శృతిహాసన్ అనుకుంటున్నాం అని చెప్పడంతో ఆమె ఫిక్స్ అనుకున్నారు. ఇటీవల శృతిహాసన్ ముంబాయి నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చిందని టాక్ రావడంతో శృతిని ఖరారు చేసారని వార్తలు వచ్చాయి.
 
తాజాగా తెలిసింది ఏంటంటే... ఇందులో ఆమె పాత్ర నిడివి తక్కువని, అందుచేత ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పిందని తెలిసింది. ఇది పవన్‌తో పాటు టీమ్‌కి షాకే అని చెప్పచ్చు. మరి... పవన్ సరసన నటించే ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.