1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. RRR movie: Alia Bhatt learning Telugu Language

ఆర్ఆర్ఆర్: రాజమౌళి దెబ్బకు తెలుగు నేర్చుకుంటున్న ఆలియా భట్..

RRR movie
ఆలియా భట్ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్. గ్లామర్ ఫీల్డ్‌లో ఓ రేంజ్‌లో ఆమె సత్తా చాటుతోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆలియా భట్ ఆ తరువాత దూసుకుపోతోంది. డియర్ జిందగీ, రాజీ సినిమాలతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. గల్లీబాయ్ మూవీలో ఆమె నటనకు ఫిదా అయ్యారు అభిమానులు.
 
అయితే తెలుగులో ప్రస్తుతం బిజీగా ఉంటోంది ఆలియా. అందుకు కారణం ఆర్.ఆర్.ఆర్. మూవీనే. చెర్రీ సరసన ఆలియా నటిస్తోంది. అయితే ఆలియా తాను నటిస్తున్న సినిమాలో తానే తన సొంత డబ్బింగ్ చెప్పుకోవాలన్నది ఆలోచన. 
 
అందుకే తెలుగులో బేసిక్స్ నేర్చుకుంటోందట. తెలుగులో ఓనమాలు నేర్చుకోవడానికి ట్యూటర్‌ను పెట్టుకుందట. ఖాళీ దొరికితే చాలట. వెంటనే తెలుగు భాషను నేర్చుకోవడం స్టార్ట్ చేసిందట. సినిమా షూటింగ్ పూర్తయ్యేలోగా తెలుగు నేర్చేసుకుని తన డబ్బింగ్ తానే చెబుతానంటోంది ఆలియా భట్. ఐతే రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడమంటే ఎవరైనా కెరీర్లో మరికొంత నేర్చుకోక తప్పదనేది తెలిసిన విషయమే.
About Writer
జె
తర్వాతి కథనం
అది పట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ కోసం తిరుగుతున్న సీనియర్ డైరెక్టర్లు..