సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (20:32 IST)

ర‌వితేజ ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో..‌.

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం డిస్కో రాజా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలావుంటే... ర‌వితేజ, ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తితో సినిమా చేయ‌నున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మూవీని కిర‌ణ్ నిర్మించాలి అనుకున్నారు. 
 
ఆనంది ఆర్ట్స్ బ్యాన‌ర్ పైన రూపొందే ఈ సినిమాని త్వ‌ర‌లో అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారు అనుకున్నారు. ఇంత‌లో ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ చీప్ స్టార్ అంటూ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ చేయ‌డానికి కార‌ణం. ఈ ప్రాజెక్ట్ ఆగిపోవ‌డ‌మే అని తెలిసింది. అస‌లు దీని వెన‌కున్న అస‌లు కార‌ణం ఏంటంటే... ర‌వితేజ రెమ్యూన‌రేష‌న్ బాగా ఎక్కువ చెప్పాడ‌ట‌. ఆయ‌న చెప్పిన రెమ్యూన‌రేష‌న్ విని నిర్మాత కిర‌ణ్ షాక్ అయ్యాడ‌ట‌. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని ఫిల్మ్ న‌గ‌ర్లో టాక్ వినిపిస్తోంది.
 
ప్ర‌స్తుతం ర‌వితేజ సినిమాలు అంత‌గా ఆడ‌డం లేదు అయిన‌ప్ప‌టికీ... ఇలా రెమ్యూన‌రేష‌న్ బాగా ఎక్కువ కావాలంటూ డిమాండ్ చేయ‌డం ఏంటో..? ఈ మాస్ మ‌హారాజా ఆలోచ‌న మార్చుకోకుంటే... ఆయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి భూత‌ద్దం ప‌ట్టుకుని వెతికినా నిర్మాత‌లు దొర‌క‌ని ప‌రిస్ధితి రావ‌చ్చు. మ‌రి... ర‌వితేజ ఎప్పుడు తెలుసుకుంటాడో..?