బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (21:00 IST)

ఆ ఛాన్స్ తమిళనాడు సర్కారుకివ్వను : రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం "భైరవ". ఈ చిత్రం 1978లో రాగా, కలైజ్ఞానం అనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించారు. అదీ సోలో హీరోగా నిర్మించారు. పైగా, ఈయన సినీ రచయిత కూడా. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ చలించిపోయారు. ఆయనకు కోటి రూపాయల విలువ చేసే సొంతింటి కలను నెలవేర్చి.. నిర్మాత కలైజ్ఞానం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 14వ తేదీన కలైజ్ఞానంకు సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో శివకుమార్‌తో పాటు.. రజినీకాంత్, దర్శకుడు కె.భాగ్యరాజ్య కూడా హాజరయ్యారు. ఇందులో శివకుమార్ మాట్లాడుతూ, కలైజ్ఞానం సొంత ఇంటిని నిర్మించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అదే వేదికపై ఉన్న రజినీకాంత్ స్పందించారు. ఈ అవకాశం తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వబోనని, తానే కలైజ్ఞానంకు ఇంటిని కొని ఇస్తానని సభాముఖంగా ప్రకటించారు. 
 
అంతటితో మిన్నకుండిపోకుండా తనకిష్టమైన దర్శకుడు భారతీరాజాకు కొత్త ఇంటిని వెదికే బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆ పనిని ఆగమేఘాల మీద పూర్తి చేశారు. దీంతో రజీనీకాంత్‌ ఇటీవలే తనకిష్టమైన నిర్మాతకు కొన్నిరోజుల క్రితమే కోటి రూపాయలతో ఓ ఇంటిని కొనుగోలు చేసి కలైజ్ఞానంకు అప్పగించినట్టు కోలీవుడ్ మీడియా పేర్కొంది.