గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:53 IST)

బిగ్ బాస్ హౌస్‌లో అందం తక్కువైందని ఆ భామలను దింపుతున్నారట..? (వీడియో)

బిగ్ బాస్ హౌస్‌లో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోతున్నారు. తాజాగా అశురెడ్డి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మొదటి వారం హేమా ఎలిమినేట్ కాగా, తమన్నా ఎంట్రీ ఇచ్చింది వైల్డ్ కార్డ్‌తో. తరువాత తమన్నా, జాఫర్ ఇలా ఎలిమినేట్ అయిపోయారు. ఆ తరువాత రోహిణి, అశురెడ్డి కూడా వెళ్ళిపోయింది. 
 
అయితే ఇప్పటిదాకా ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రమే జరిగింది. తాజాగా బిగ్ బాస్ ఇంట్లోకి మళ్ళీ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. గత కొన్నిరోజులుగా వైల్డ్ కార్డ్ ద్వారా ఇషా రెబ్బా, శ్రద్దాదాస్‌లు ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్‌లో గ్లామర్ తగ్గిందని.. ఇషా లాంటి హీరోయిన్లతో ఆ లోటు తీరుతుందనే టాక్ వినిపిస్తోంది. 
 
అంతేకాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందన్న ప్రచారం సాగడంతో సడెన్‌గా ఒక హీరోను కూడా ఎంట్రీ చేసి సర్ప్రైజ్ చేసే అవకాశాలున్నాయట. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్‌లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం ఖాయమట.