గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (19:04 IST)

నన్ను హీరోయిన్ మెటిరియల్ కానేకాదన్నారు.. నిర్మాత అలా ప్రవర్తించాడు..? (వీడియో)

బాలీవుడ్ నుంచి దక్షిణాదికి పాకిన మీటూ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. అప్పుడప్పుడు అక్కడక్కడా పేలుతోంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ తార విద్యాబాలన్ మీటూ అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. తెలుగులో వ్యాంప్ పాత్రలు వేసి సిల్క్ స్మిత బయోపిక్‌లో విద్యాబాలన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డర్టీ పిక్చర్‌తో తెరకెక్కింది. 
 
ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటీ అవార్డు ఆమెను వరించింది. ఇటీవలే విద్యాబాలన్ ఎన్టీఆర్ కథానాయకుడులో బసవతారకం పాత్రలో కనిపించారు. ఇదే ఆమెకు తొలి తెలుగు సినిమా. తమిళంలోనూ అజిత్ నటించిన నేర్కొండ పార్వైలోనూ ఆమె నటించింది. ఇక హిందీలో విద్యాబాలన్ రెండు సంవత్సరాల విరామం తర్వాత "మిషన్ మంగల్" సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాబాలన్ మాట్లాడుతూ... తన జీవితంలో చోటుచేసుకున్న చేదు సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులకు బెంగళూరు సొంతూరు కాబట్టి.. కెరీర్ మొదట్లో దక్షిణాదిన హీరోయిన్ కోసం ప్రయత్నాలు మొదలెట్టాను. ఒక తమిళ నిర్మాత ఆయన సినిమా నుండి తనను హీరోయిన్ పాత్ర నుండి తోలిగించారు. 
 
ఎందుకలా చేశారని తాను నాన్నతో కలిసి అడిగాం. ఆయన ''నన్ను నువ్వు హీరోయిన్ మెటిరియల్ కానేకాదు'' అని దారుణంగా అవమానించాడు. కొన్ని నెలలు అద్దంలో నా మొహం చూసుకోవడానికి భయపడ్డాను. ఎందుకంటే నేను అందంగా లేనని. ఆయనను నా జీవితంలో క్షమించాను.
 
కొన్ని రోజుల తరువాత ఒక తమిళ సినిమా ఆఫర్ వచ్చింది. ఆ సినిమాను ఫోన్ లోనే ఒప్పుకున్నాను. సినిమా సెట్‌కు వెళ్లాను, మొదటి రోజు షూటింగ్ అయ్యింది కానీ ఆ నిర్మాత ప్రతీ సరి నా దగ్గరికి వచ్చి జోకులు వేయడం, తనతో ప్రవర్తించిన తీరు తనకు నచ్చలేదన్నారు. మరుసటి రోజే సినిమా నుంచి బయటికి వచ్చేయడంతో లీగల్ నోటీస్ పంపినట్లు విద్యాబాలన్ చెప్పుకొచ్చారు. 


అలాగే కెరీర్ తొలి రోజుల్లో చెన్నైలోని ఒక దర్శకుడు తనను రూమ్‌కు రమ్మని పిలిచాడని విద్యాబాలన్ తెలిపారు. ''సినిమా లైన్ చెప్పడానికి ఒక దర్శకుడు నా దగ్గరకు వచ్చాడు. సినిమా పూర్తి కథ చెప్పడానికి కాస్త సమయం కావాలని అడిగాడు.

నేను సరే అని చెప్పి.. ఏదైనా కాఫీ షాప్‌లో కలుద్దామని చెప్పా. అందుకు అతను అంగీకరించలేదు. తన రూమ్‌కి రావాలని చెప్పి వెకిలిగా మాట్లాడాడు. దాంతో నాకు కోపం వచ్చి తలుపు తీసి బయటకు పొమ్మన్నాను. అతను నావైపు పైకి కిందకి చూసి వెళ్లిపోయాడు" అని విద్యాబాలన్ చెప్పింది.