అది ఇవ్వాలంటూ విద్యా బాలన్ వెంట పడ్డ త్రిష
దేశంలోని అన్ని భాషల్లో బయోపిక్ ట్రెండ్ ఇప్పుడు ఊపందుకుంది. సావిత్రి, ఎన్టీఆర్, ఘంటసాల ఇలా ఒక్కొక్కరి మీద బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర కూడా బయోపిక్‌గా తెరకెక్కుబోతోందట. ఇందిరాగాంధీ పాత్రలో త్రిష నటించడానికి సిద్థంగా ఉన్నానని చెబుతోందట.
దేశానికి సుధీర్ఘ కాలం పాటు ప్రధానిగా పనిచేసిన ఇందిరాంధీ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కబోతోంది. ఇందిరాగాంధీ బయోపిక్ తీసేందుకు కొన్ని సంవత్సరాల క్రితమే ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో ఆ పాత్ర కోసం మనీషా కోయిరాల పేరు వినిపించింది. ఇందుకోసం ఆమె సన్నబడినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అర్థాంతరంగా సినిమా ఆగిపోయింది.
ఆ తరువాత తాజాగా ఇందిరాగాంధీ పాత్రలో నటించడానికి త్రిష సిద్థంగా ఉందట. బెంగుళూరుకు చెందిన సాద్విక రాసిన పుస్తకం ఆధారంగా ఇందిరాగాంధీ బయోపిక్‌ను చిత్రీకరించనున్నారు. సినిమాగా తీయలా వెబ్ సిరీస్ చేయాలా అన్న ఆలోచనలో ఉన్నారు నిర్మాత విద్యాబాలన్. విద్యాబాలన్ అంటే మరెవరో కాదు... హీరోయినే. విద్యాబాలన్‌కు ఇందిరాగాంధీ జీవిత చరిత్ర తీయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అందుకే తన సొంత డబ్బులతో సినిమా తీయాలన్న నిర్ణయానికి వచ్చిందట.
రాజకీయ నాయకురాలిగా నటించాలన్న కోరిక ఉన్న త్రిష ఈ పాత్రలో చేయడానికి ఉత్సాహం చూపిస్తోందట. స్వయంగా విద్యాబాలన్ వద్దకు వెళ్ళి రిక్వెస్ట్ కూడా చేసిందట త్రిష. అయితే జీవిత చరిత్రలో నటించడమంటే కష్టంతో కూడుకున్న పనని, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పిందట విద్యాబాలన్. అంతలోనే ఇందిరాగాంధీ క్యారెక్టర్‌లో త్రిష నటిస్తోందంటూ ప్రచారం ప్రారంభమైంది. రాజకీయ నాయకురాలిగా బయోపిక్‌లో నటించిన తరువాత తన ఇమేజ్ బాగా పెరుగుతుందన్న నమ్మకంతో ఉందట త్రిష.