మహిళలు 40ల్లోనే ఆ విషయంలో మాంచి రసపట్టుగా వుంటారు... విద్యా బాలన్
బసవతారకంగా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న విద్యాబాలన్ చాలా విషయాల్లో బోల్డ్‌గా మాట్లాడుతుంది. తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే విద్యాబాలన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్త్రీల వైవాహిక జీవితం గురించి చాలా బోల్డ్‌గా మాట్లాడేసింది.
ఆమె వయస్సుకి చెందిన మహిళల వైవాహిక జీవితం ఎలా ఉంటుందని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... మహిళలకు అసలు జీవితం నలభై సంవత్సరాల తర్వాతే ప్రారంభమవుతుందని, ఆ వయస్సులోనే వాళ్లు చాలా హాట్‌గా కనిపిస్తారని చెప్పింది.
ఆ వయస్సులో మహిళల దాంపత్య జీవితం గురించి అడిగిన ప్రశ్నకు బదులుగా... నలభైల్లోకి అడుగుపెట్టిన మహిళలకు శృంగారంపైన ఆసక్తి ఉండదనే మాట అవాస్తవమని, నిజానికి వారు ఆ వయస్సులోనే మరింత బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చింది. అయితే ఇది తన స్వంత అభిప్రాయమని వాస్తవంగా భిన్నంగా కూడా ఉండవచ్చని చెప్పింది.