అల్లు అర్జున్‌తో అది నిజమైతే బావుండు: సయీ మంజ్రేకర్
Saiee manjrekar, major
అలాగే తన కిష్టమైన హీరోతో నటిస్తే దానిని మరింత జాగ్రత్త చేసుకుంటానంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ నటుల గురించి చెబుతూ, `అల వైకుంఠపురములో..` సినిమా చూశా. అందులో బన్నీ డ్యాన్స్, నటన చూసి ఫిదా అయిపోయా. ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని సయీ తెలిపింది.
అల్లు అర్జున్‌తో కొత్తతరం నాయికలు నటించాలనుందని అంటుండం కామనే. కానీ సయీ మాత్రం ఖచ్చితంగా నా కల నిజమైతే బాగుంటుందని తెలియజేస్తుంది. తెలుగు హీరోలలో నాకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి నేను నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అవి నిజమైతే బాగుంటుంది` అని వెల్లడించింది.
ఇక మేజర్ సినిమా గురించి చెబుతూ.. భారతదేశం గర్వించదగ్గ చిత్రం అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తుంది. మహేష్‌బాబు ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మేజర్ సినిమాకు అడవి శేషు కథానాయకుడిగా నటించాడు. త్వరలో విడుదల కానుంది.
