శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

భార్యకు విడాకులిచ్చిన హీరోతో డేటింగ్ చేశా : కంగనా రనౌత్

బాలీవుడ‌లో బోల్డ్ నటిగా గుర్తింపు పొందిన హీరోయిన్ కంగనా రనౌత్. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. తన మనసులోని విషయాన్ని సూటిగా, సుత్తిలేకుండా చెపుతోంది. గతంలో తాను చేసిన ఓ విషయాన్ని కూడా ఆమె ఇపుడు ధైర్యంగా చెప్పింది. మాదక ద్రవ్యాలకు బానిసై భార్యకు విడాకులిచ్చిన హీరోతో తాను డేటింగ్ చేసినట్టు తెలిపింది.
 
తాజాగా ఆమె ఓ జాతీయ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఓ హీరో డ్ర‌గ్స్ వాడేవాడ‌ని, అధిక మోతాదులో తీసుకోవ‌డం వ‌ల‌న ఆరోగ్యం క్షీణించి ఆసుప‌త్రిలో చేరాడ‌ని పేర్కొంది. అంతేకాదు అత‌ని అలవాట్ల‌ని భ‌రించ‌లేక అత‌ని భార్య విడాకులు కూడా ఇచ్చింది. ఆ త‌ర్వాత త‌న‌తో నేను డేటింగ్ చేశాను. ఆయ‌న ఫ్యామిలీ న‌న్ను ఎంతో ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేసింద‌ని చెప్పింది.
 
బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో 99 శాతం మంది డ్ర‌గ్స్ వాడుతుంటారు. నాకు గురువుగా చెప్పుకునే ఓ ద‌ర్శ‌కుడు నాకు కూడా డ్ర‌గ్స్ రుచి చూపించాడు. ఇక్క‌డ డ్ర‌గ్స్ స‌ప్లై చేసే వారిని విచారిస్తే చాలా మంది స్టార్స్ జైల్లో ఉంటారంటూ కంగ‌నా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. కాగా, సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత కంగనా ర‌నౌత్.. బాలీవుడ్‌లోని చీక‌టి కోణాల‌ని ఒక్కొక్క‌టిగా వెలుగులోకి తెస్తుంది.