శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (22:50 IST)

తొలి రాత్రిలో షాక్.. యువకుడి అలా మోసపోయాడు.. పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు..

పెళ్లి పేరుతో ఓ యువకుడు మోసపోయాడు. మొదటి రాత్రి సమయంలో ఈ విషయం తెలుసుకుని షాకయ్యాడు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆ యువకుడు తొలిరాత్రి గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నాడు. అంతే ఫైవ్ స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. అప్పటి వరకు అంతా సవ్యంగా జరిగింది. పెళ్లి చేసుకున్న అమ్మాయి గదిలోకి వచ్చింది. మాటలు కలిశాయి.
 
చేతల్లో తానేంటో నిరూపించుకోవాలని అనుకున్న యువకుడికి ఆ పెళ్లి కూతురు షాక్ ఇచ్చింది. తాను అమ్మాయిని కాదని బాంబు పేల్చింది. అబ్బాయినని.. గే అంటూ చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు. అంతే అక్కడి పారిపోయిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఈ సంఘటన థాయిలాండ్‌లో జరిగింది. రెస్టారెంట్‌లోని పబ్‌లో యువతి బుకాన్‌ అనే బాధిత యువకుడికి బాగా నచ్చింది. మాట కలిపాడు. ప్రేమించానని చెప్పాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. తీరా చివరకు మొదటిరాత్రి తాను అమ్మాయిని కాదని అబ్బాయిని అని పెళ్లికూతురు చెప్పడంతో బుకాన్ షాక్ తిన్నాడు.