1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Jio Point Stores launch Consumer Electronics in Andhra Pradesh

ఏపీలో మొదలైన జియో పాయింట్ స్టోర్ల అమ్మకాలు.. ఆన్‌లైన్ షాపింగ్ చేయని వారే టార్గెట్

Jio Point Stores
ఏపీలో జియో పాయింట్ స్టోర్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 38 నగరాలు, పట్టణాల్లోని జియో పాయింట్ స్టోర్లలో బుధవారం ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాల అమ్మకాలు మొదలయ్యాయి. కొత్తగా రూపుదిద్దుకున్న ఈ స్టోర్లలో మొబైల్స్‌, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు అమ్మకానికి వుంచుతామని జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ తెలిపారు. 
 
ఇంటర్నెట్ సదుపాయం లేని, ఆన్‌లైన్‌లో ఎప్పుడూ షాపింగ్ చేయని వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని జియో పాయింట్ స్టోర్లు రూపొందించబడ్డాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ స్టోర్లలో కేవలం 4జీ మొబైల్స్, జియో సిమ్ అమ్మకాలు జరిగేవని, ఇప్పుడు ప్రారంభిస్తున్న ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలతో ఈ స్టోర్లు మరింత చేరువ కానున్నాయని తెలిపారు.
 
ప్రారంభ ఆఫర్ కింద వినియోగదారులకు రూ. 1100 విలువైన బహుమతులు, రూ. 300 విలువైన గిఫ్ట్ వోచర్లు ఖచ్చితంగా లభిస్తాయని తెలిపారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. 
తర్వాతి కథనం
సామాజిక మాధ్యమ వేదికల ఆలంబనగా చేనేత వస్త్ర ప్రచారం, ముందడుగు వేస్తున్న “ఆప్కో”