వివాహితతో అక్రమ సంబంధం, ఆమె వేరొకరితో శారీరక బంధం పెట్టుకుందన్న అనుమానంతో?
వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆమె వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని తెలిసి తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఆమెను చంపేయాలనుకుని నిర్ణయించుకుని ఒక పక్కా ప్లాన్‌తో హతమార్చి తప్పించుకు తిరుగుతున్నాడు.
నెల్లూరు జిల్లా కావలి ఇస్లాంపేటకు చెందిన షకీలా అనే వివాహితకు తొమ్మిదేళ్ళ క్రితం వివాహమైంది. ఈమెకు ఇద్దరు పిల్లలు. భర్తతో విబేధించి సంవత్సరం క్రితం పిల్లలను తీసుకుని వేరు కాపురం పెట్టింది. ఇళ్ళలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది.
అయితే తన ఇంటి పక్కనే ఉన్న అక్తర్ అనే యువకుడితో పరిచయం పెట్టుకుంది షకీలా. ఆ తతంగం కాస్త సంవత్సరం సాగింది. పిల్లలకు కూడా తెలియకుండా జాగ్రత్త పడేది షకీలా. అయితే తాను ఇంటికి పనికివెళ్ళే చోట మరో యువకుడితో చనువుగా ఉంటోందన్న విషయం అక్తర్ కు తెలిసింది.
దీంతో తన స్నేహితుడితో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. ఆమెను నిన్న సాయంత్రం ఏకాంతంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు. తన స్నేహితుడితో కలిసి గొంతునులిమి చంపేశాడు. అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.