యువకుడితో అక్రమ సంబంధం, ఆ విషయం భర్తకు చెప్పేసింది...
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని వసంతమ్మ, క్రిష్ణమూర్తిలు నివాసముండేవారు. వీరికి పెళ్ళయి 10 సంవత్సరాలవుతోంది కానీ పిల్లలు లేరు. చేతి వృత్తి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. ఇంట్లో వీరిద్దరు మాత్రమే ఉండేవారు. పెద్దవాళ్ళలందరూ చనిపోయారు.
కూరగాయలు కొనేందుకు వసంతమ్మ దగ్గరలోని ప్రొవిజన్ షాపుకు వెళ్ళేది. ఆ షాపులో ఉన్న పురుషోత్తం అనే యువకుడికి వివాహితపై కన్ను పడింది. ఆమెకు మాయమాటలు చెప్పాడు. మెల్లగా తనవైపు తిప్పుకున్నాడు. వసంతమ్మకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు.
భర్తకు ఎలాంటి అనుమానం రాకుండా ఫోన్లో వసంతమ్మ యువకుడితో మాట్లాడుతూ వచ్చింది. ఆ పరిచయం కాస్త చివరకు శారీరక సంబంధానికి దారితీసింది. పురుషోత్తం వసంతమ్మతో ఏకాంతంగా ఉన్న వీడియోలను తీశాడు. ఆ విషయం దాచి ఉంచి మరో ముగ్గురు స్నేహితులను ఆమెకు పరిచయం చేశాడు.
వారితో కూడా శారీరక సంబంధం పెట్టుకోవాలన్నాడు. అందుకు వసంతమ్మ ఒప్పుకోలేదు. దీంతో ఆ వీడియోలను చూపించాడు. దీంతో ఖంగు తింది వసంతమ్మ. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని వారితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇలా సంవత్సరంకు పైగా కొనసాగింది.
అయితే ఈమధ్య కాలంలో కరోనా సమయంలో భర్త ఇంట్లోనే ఉండటం.. ఆ యువకుల నుంచి తరచూ ఫోన్లు రావడం.. మానసికంగా ఒత్తిడి గురవడంతో చివరకు వసంతమ్మ తన భర్తకు జరిగిన విషయాన్ని చెప్పేసింది. భార్య పడుతున్న ఆవేదనను అర్థం చేసుకున్న భర్త స్వయంగా ఆమెను తీసుకెళ్ళి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితుల్లో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.