బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 13 ఆగస్టు 2020 (13:37 IST)

పొదల్లో వివాహితతో ప్రియుడు రాసలీలలు, కళ్ళారా చూసిన భర్త, ఆ తరువాత..?

సారా కోసం వెళ్ళాడు. వివాహితను లోబరుచుకున్నాడు. ప్రతిరోజు సారా తాగడం.. ఆమెను పొదల మాటుకి తీసుకెళ్ళడం.. ఇదే అతని పని. అయితే అతని పాపం పండింది. రాసలీలల్లో మునిగి తేలిన బాగోతాన్ని ప్రత్యక్షంగా వివాహిత భర్త చూశాడు. ఇంకేముంది.
 
విశాఖ జిల్లా పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ పరిధి హస్తినాపురం గ్రామంలో ధర్మరాజు నివాసమున్నారు. స్థానికంగా ఉన్న కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న ధర్మరాజుకు ముత్యాలమ్మ పాలెం పంచాయతీ పరిధిలోని దిబ్బపాళెం వద్దనున్న సారా బట్టీకి వెళ్ళేవాడు.
 
ఆ సారా కొట్టును మహిళ నడుపుతోంది. ఆమెతో ధర్మరాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సారాకు వెళ్ళడం.. ఆమెను పక్కనున్న జీడితోటకు తీసుకెళ్ళడం.. ఇలా వారిద్దరు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇది కాస్త గత నెల రోజుల నుంచి నడుస్తోంది. అక్కడ పనిచేసే వారి ద్వారా భర్త పాపయ్యకు అసలు విషయం తెలిసింది. 
 
కోపంతో రగిలిపోయిన పాపయ్య ఎలాగైనా ధర్మరాజును చంపేయాలనుకుని ప్లాన్ చేశాడు. పూటుగా సారాను ధర్మరాజుతో కలిసి తాగి ముత్యాలమ్మపాలెం సమీపంలోకి రాగానే గబుక్కున పక్కనే వున్న బండరాయిని అందుకుని దానితో అతడి తలపై మోది చంపేశాడు. పోలీసుల విచారణలో అస్సలు విషయం బయటపడడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.