శోభనం రాత్రి బెడ్ పైన భర్తకు బదులు అతని తమ్ముడు.. భార్య షాక్
కొత్తగా పెళ్ళయ్యింది. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగు పెట్టింది. కొత్త జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని భావించింది. కానీ ఆశలన్నీ రెండు రోజుల్లోనే అడియాశలైపోయాయి. పెళ్ళి చేసుకున్న భర్త సంసారానికి పనికిరాడని తెలిసి భార్య షాక్‌కు గురైంది. అంతేకాదు భర్తకు బదులు తన గదిలో అతని తమ్ముడిని చూసి నిశ్చేష్టురాలైపోయింది.
మధ్యప్రదేశ్ లోని ఇటార్సీ ప్రాంతమది. కరోనా సమయంలో మూడు రోజుల క్రితం తక్కువమంది బంధువులతో లల్లు, పుష్పలకు వివాహం జరిగింది. లల్లూ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కట్నం బాగానే ఇచ్చి వివాహం చేశారు. ఇక తమ కూతురు హాయిగా జీవితాన్ని గడుపుతుందని తల్లిదండ్రులు అనుకున్నారు.
కానీ కుమార్తె రెండురోజులకే పోలీసు స్టేషన్‌కు వెళుతుందని ఊహించలేకపోయారు. వివాహం జరిగినప్పటి నుంచి లల్లూ తమ్ముడు భిల్లా వదినతో బాగా మాటలు కలిపాడు. మాట్లాడకున్నా పదేపదే అతనే ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇదంతా పెళ్ళికూతురుకు ఏ మాత్రం ఇష్టం లేదు.
అయినా కొత్త కాపురం కదా సర్దుకుపోదాంలే అనుకుంది. మొదటిరోజు రాత్రి భర్త శోభనం వద్దన్నాడు. మన ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ తరువాత కలుద్దామని చెప్పాడు. దీంతో భార్య కూడా సరేనంది. రెండవరోజు భర్త నిరుత్సాహంగా పడుకున్నాడు. ఆ తర్వాత మెల్లిగా తను సంసారానికి పనికిరానని చెప్పాడు. దీంతో షాక్‌కు గురైంది భార్య.
కొద్దిసేపటికి తేరుకోగానే భర్త బెడ్ పైన అటు తిరిగి పడుకుని నిద్రపోయాడు. చేసేది లేక ఆమె కూడా ఇటు తిరిగి పడుకుంది. కాసేపటి తరువాత నడుంపై చెయ్యి వేశాడు. భర్తే ఇదంతా చేస్తున్నాడని అనుకుంది. తన భర్త తనతో తమాషాగా మాట్లాడి ఉంటాడని భావించింది. తిరిగి చూసేసరికి అతని తమ్ముడు బెడ్ పైన కనిపించాడు.
దీంతో షాకయ్యింది. అతని నుంచి తప్పించుకోవాలనుకుంది. కానీ ఇంతలో అతను బలాత్కరించాడు. గట్టిగా అరిచి అతడిని కిందికి ఒక్క తోపు తోచేసి బయటకు వచ్చేసింది. జరిగిన విషయాన్ని స్థానికుల సహాయంతో పోలీసులకు తెలిపింది. భిల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్ళయిన రెండురోజులకే కుమార్తె జీవితం నాశనం కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.