లేదా నీకంటూ ఓ అభిప్రాయం.. ఓ అర్థాంగి

love couple
ఠాగూర్| Last Updated: గురువారం, 6 ఆగస్టు 2020 (19:00 IST)
కట్టుకుంటావు
ఏ రంగు చీర తెచ్చినా...

జడలో తురుముకుంటావు
ఏ రకం పూలు తెచ్చినా...

తింటావు నీవు
ఎటువంటి తీపి తెచ్చినా...

రమ్మంటే వస్తావు
అది ఎటువంటి చలనచిత్రమైనా...

వెళదామంటే వస్తావు
ఎక్కడకని అడకుండా...

మారు మాట్లాడక చిరునవ్వుతో స్వీకరిస్తావు
రక రకాల నగలు తెచ్చినా...

సంతోషంగా అందుకుంటావు
పిల్లలకు ఎటువంటి బట్టలు తెచ్చినా...

లేదా నీకంటూ ఓ అభిప్రాయం...

నేను మీలో సగమైనపుడు
ఎందుకుంటాయండీ మన మధ్య అభిప్రాయభేదాలు...

--- గుడిమెట్ల చెన్నయ్యదీనిపై మరింత చదవండి :